గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (13:21 IST)

గబ్బర్ సింగ్‌తో ప్రియమణి..?

దక్షిణాదిన ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ప్రియమణి... ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే స్టార్టింగ్‌లో మంచి జోరు మీదున్న ప్రియమణి కెరీర్.. కొన్ని సంవత్సరాల క్రితం వరుస ప్లాపులతో భారీ డిజాస్తర్‌గా మారింది. 
 
దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. పెళ్లి చేసుకుంది. ఇక సెకంద్ ఇన్నింగిస్ లో బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తున్న ప్రియమణికి.. వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నిండ్స్‌ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తోంది ఈ భామ.
 
ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్, 'నారప్ప' 'విరాట పర్వం..సినిమాలోనటించిన ప్రియమణికి. మరో క్రేజీ కాంబోలో అవకాశం వచ్చిన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. 
 
ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రీపీట్ అవుతుందడంతో. అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనుందట. ఈ పాత్ర టోటల్ సినిమాకే కీ రోల్ అని టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రియమణి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.