గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:41 IST)

సీఎం స్టాలిన్ పై పవన్ ట్వీట్, కోటి మంది చూసారు, తమిళనాడు అసెంబ్లీలో చర్చ

పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎవరి గురించి మాట్లాడరు. ఎపి ప్రభుత్వంపై విమర్సలు చేయాలంటే కూడా సున్నితంగా విమర్సలు ఉంటాయి. జగన్ సర్ ఇలా చేయండి అంటూ గౌరవంగా సంబోధిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తుంటారు పవన్ కళ్యాణ్.
 
ఎవరిని నొప్పించకుండా ఆయన ట్వీట్లు ఉంటాయి. ఒక్కోసారి తన మనస్సుకు ఇలా చేయాలి అనిపిస్తే మాత్రం ఠక్కున వ్యక్తి చేసిన గొప్పతనాన్ని గురించి పొగుడుతూ ట్వీట్ చేస్తారు. తాజాగా పవన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. 
 
సిఎం స్టాలిన్ పైన పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. స్టాలిన్‌ను ప్రశంసిస్తూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు. తెలుగులో చేసిన ట్వీట్‌ను తమిళనాడు అసెంబ్లీలో చదివి వినిపించారు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణ్యన్. 
 
అసెంబ్లీలో ఒకవైపు తెలుగులో చదువుతూ తమిళంలో ట్రాన్స్‌లేషన్ చేస్తూ సభలోని సభ్యులకు వివరించారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో చప్పట్లతో మారుమ్రోగింది. రాజకీయాలు చేయాలి కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం కాదు. స్టాలిన్‌ను చూసి నేర్చుకోండి అంటూ కొంతమందిని ఉద్దేశించి పవన్ చేసిన ట్వీట్ చర్చకు దారితీస్తోంది.