kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి
శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాటపై దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం.
ఈ దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉంది. ఈ రోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు రావడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ... ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కానీ సదరు వ్యక్తి చేయలేదు. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణం.
ఇప్పటికే ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.