గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (22:17 IST)

నాగార్జున సిల్క్ షర్టు ధరెంతో తెలుసా?

Shirt
టాలీవుడ్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా తన అందంతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటాడు. ఇక తన ఫిజిక్ మెయింటైన్ మీద ఎక్కువగా అమల స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
 
ఇక నాగార్జున వేసే డ్రెస్ విషయంలో కూడా తన ఇద్దరు కొడుకులను మించే విధంగా ఉంటుంది. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ వరల్డ్‌లోనే టాప్ మోస్ట్ బ్రాండెడ్ అని తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో వేసే అన్నీ దుస్తులు చాలా బ్రాండెడ్ వస్త్రాలు అన్నట్లుగా సమాచారం. అయితే గతవారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సిల్క్ షర్టు వేసుకొని అదిరిపోయే లుక్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు.
 
ఇక షర్ట్ అమెరికన్ డాలర్స్ ప్రకారం.. $1110 రూపాయలు అదే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.82,211లన్నమాట. అయితే ఈ ధరతో చిన్నపాటి వివాహం అవుతుంది అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.