1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (17:01 IST)

మీ రాష్ట్రానికి వచ్చిన ఈ సోదరుడికి గిఫ్ట్ లేదా సీతక్కా? రాహుల్ ప్రశ్న

setakka - rahul
మీ రాష్ట్రానికి వచ్చిన ఈ సోదరుడికి గిఫ్ట్ లేదా సీతక్కా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడిగారు. ఆయన అడిగిందే తడవుగా రాహుల్ గాంధీకి రూ.20 వేల విలువ చేసే షూను బహుమతిగా ఇచ్చారు. 
 
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సీతక్క ఎంతో యాక్టివ్‌గా పాలు పంచుకుంటుంది. తెలంగాణాలోనేకాకుండా తమిళనాడులో జరిగిన యాత్రలో కూడా ఆమె హాజరయ్యారు. పైగా, సీతక్క ఎక్కడ కనిపించినా ఆమెను ఓ సొంత సోదరిలా ఆమె భుజంమీద చేయి వేసి మరీ తనకు ఆమె పట్ల ఉన్న ఆప్యాయతను రాహుల్ కనబరుస్తుంటారు. తెలంగాణాలో జరిగిన పాదయాత్రలోనూ సీతక్కతో ఆయన అంతే ఆత్మీయతో మెలిగారు. 
 
పాదయాత్ర హైదారాబాద్ దాటి సంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టినపుడు ఓ రోజు గిరిజనులతో కలిసి రాహుల్ నృత్యం చేశారు. ఆ సమయంలో సీతక్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీ రాష్ట్రానికి వచ్చిన ఈ సోదరుడికి గిఫ్ట్ లేదా సీతక్కా? అని రాహుల్ ప్రశ్నించారు. 
 
అంతే.. ఆయన అడగటమే మహాభాగ్యంగా భావించిన సీతక్క.. రాహల్ సెక్యూరిటీ సిబ్బంది వద్దకెళ్లి రాహుల్ షూ సైజు, ఆయన వాడే షూ కంపెనీ బ్రాండ్ గురించి తెలుసుకుని ఆ మరుసటి రోజే రాహుల్‌కు షూను ఆమె బహుకరించారు. 
 
ఈ షూ చూసి ముచ్చటపడిన రాహుల్ తన సోదరి తనకు ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిందని పొంగిపోయారట. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు చెప్పిమరీ రాహుల్ సంబరపడిపోయారట. రాహుల్‌కు షూ బహుకరించేందుకు సీతక్క దాదాపుగా రూ.20 వేలు ఖర్చు చేసినట్టుగా పార్టీ శ్రేణులు చెప్పకుంటున్నాయి.