1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS State Congress Leader Dasoju Sravan to quit from party

టీ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ : దాసోజు శ్రవణ్ రాజీనామా?

dasoju sravan kumar
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలిగింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరమైపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. 
 
ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కాసేపట్లో  మీడియా ముందు ప్రకటించనున్నట్లు సమాచారం. 
 
గత కొంతకాలంగా పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్‌ అసంతృప్తిగా ఉన్నారు. పీజేఆర్‌ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన అలిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. 
 
శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కలిసి దాసోజు ఇంటికి చేరుకున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ  బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. 
తర్వాతి కథనం
కర్ణాటకలో దారుణ ఘటన: బాల్కనీలో నిలబడి బిడ్డను విసిరేసింది...