శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (09:10 IST)

నేడు తెలంగాణాలో 14 జిల్లాల్లో వర్షాలు - ఆ జిల్లాల్లో కుంభిృష్టి

Rains
తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా, కుమరం భీమ్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
నైరుతి రుతుపవనాలకుతోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరోమారు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ కారణంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదారు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 9 జిల్లాల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షం, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది.