1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (16:11 IST)

గుజరాత్‌లో దారుణం.. బతికున్న శిశువును పొలంలో పాతిపెట్టారు..

new born baby
గుజరాత్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులెవరో చిన్నారిని బతికుండగానే పొలంలో పాతిపెట్టారు. పొలం యజమాని గుర్తించి చిన్నారిని కాపాడాడు. వివరాల్లోకి వెళితే., గుజరాత్, సంబర్కాంత జిల్లా, గంభోయ్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన రైతు గురువారం ఉదయం తన పొలానికి వెళ్లాడు.
 
ఈ క్రమంలో ఒక చోట తన పొలంలో ఎవరో తవ్వినట్లు అనిపించింది. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే.. ఒక చిన్నారి చేయి పైకి తేలి కనిపించింది. వెంటనే షాక్ తిన్న రైతు.. పక్కనే పవర్ స్టేషన్‌లో పని చేస్తున్న వాళ్లను పిలిచాడు. వారి సహాయంతో అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా, ఒక శిశువు కనిపించింది. 
 
అయితే, ఆ చిన్నారి ప్రాణాలతోనే ఉంది. వెంటనే విషయాన్ని ఆ రైతు అధికారులకు తెలిపాడు. పొలానికి చేరుకున్న అధికారులు అంబులెన్స్‌లో చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.