మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (16:14 IST)

గుజరాత్ అల్లర్లు - ప్రధాని మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన సిట్... సమర్థించిన సుప్రీం

PM modi
గుజరాత్ రాష్ట్రంలో గత 2002లో జరిగిన అల్లర్ల కేసులో ఆనాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్‌చిట్ ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. దీంతో గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోడీకి ఎలాంటి సంబంధం లేదా పాత్ర లేదని తేటతెల్లం చేసింది. 

నిజానికి ఈ అల్లర్లు కేసులో గతంలోనే సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని న్యాయమూర్తులు ఖాన్ విల్కర్, దినేశ్, మహేశ్వరి, సినీట రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. 

పైగా సిట్ ఇచ్చిన తీర్పునే సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మేజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని, ఈ కేసులో దాఖలైన నిరసన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.