గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (10:10 IST)

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. 494 మందికి పాజిటివ్

corona
తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28వేల 865 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 315 కొత్త కేసులు వచ్చాయి. 
 
రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు 
 
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 97వేల 632 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 473 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.