శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (10:22 IST)

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించినప్పటికీ బుధవారం మాత్రం మళ్లీ పెరిగిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం 6594 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం గణాంకాల ప్రకారం 8822 కేసులు పెరిగాయి. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం 33.7 శాతం మేరకు పెరిగాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,32,45,517గా ఉంది. 
 
అలాగే, 4,26,67,008 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 5,24,792 మంది మరణించారు. బుధవారం కరోనా వైరస్ బాధితుల్లో 15 మంది చనిపోయారు. 5718 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు.