శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (10:34 IST)

దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించగా, తాజాగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,594 కేసులు మాత్రమే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
నిజానికి గత మూడు రోజులుగా 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయడంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టారు. దీంతో 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అంటే సోమవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 18 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 
 
తాజా కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,32,36,695కు చేరింది. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారు.