గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జూన్ 2022 (15:40 IST)

14 నుంచి దేశంలో తొలి టూరిస్ట్ ప్రైవేట్ రైలు సర్వీస్

train
భారతీయ రైల్వే శాఖ మొదటి ప్రైవేట్ రైల్ సేవలను ప్రారంభించింది. ఈ రైలు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నుంచి మహారాష్ట్ర నుంచి షిర్డీకి నడుపుతారు. ఈ రైలు తొలి సర్వీసు జూన్ 14వ తేదీన కోవై నుండి ప్రారంభమై షిర్డీకి చేరుకుంటుంది. 
 
ఈ రైలు కోవైలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. ఇది తిరుపూరుకు రాత్రి 7 గంటలకు, ఈరోడు రాత్రి 8 గంటలకు, సేలంకు రాత్రి 9.15, 15వ తేదీన రాత్రి 00.10, గంటలకు జోలార్‌పేటకు, ఎహలంకు ఉదయం 5 గంటలకు, ధర్మవరం 6.20, మంత్రాలయం రోడ్డు 11.00 గంటలకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు వరకు మంత్రాలయంలో ఉండే ఈ రైలు అక్కడ నుంచి 4 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. 
 
అలాగే 17వ తేదీ ఉదయం 7.25కి షిర్డీ నుంచి బయలుదేరి వాడి రైల్వే స్టేషన్‌కి సాయంత్రం 4.30కు, ధర్మవరానికి రాత్రి 11.10కి, ఎహలంకకు 18వ తేదీ ఉదయం 2.10కి, జోలార్‌పేటకు ఉదయం 5.55కు, సామ్‌ల్‌కు 7.30కి, 2.00, 5.30కి. వద్దకు వచ్చి చేరుతుందని దక్షిణ రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.