గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (08:51 IST)

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం - ఇద్దరు మృతి

gunshoot
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత మరోమారు వినిపించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్ కాల్పుల ఘటన మరిచిపోకముందే చికాగోలో మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
చికాగోలోని ఇండియానా నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనతో చికాగోలో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కాగా, ఈ కాల్పులు జరిపిన తర్వాత దండుగుడు అక్కడ నుంచి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.