గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (19:09 IST)

జాన్సన్‌ కంట్రోల్స్‌: హైదరాబాద్‌లో తమ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం

KTR
స్మార్ట్‌, హెల్తీ-సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌ కోసం అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న జాన్సన్‌ కంట్రోల్స్‌ నేడు అధికారికంగా తమ నూతన, అత్యాధునిక, ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌, ఎక్స్‌లెన్స్‌ కోసం తెరిచినట్లు వెల్లడించింది.


హైదరాబాద్‌లోని జాన్సన్‌ కంట్రోల్స్‌, ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖామాత్యులు కె.టి.రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాన్సన్‌ కంట్రోల్స్‌ గ్లోబల్‌ సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ జనరల్‌ మేనేజర్‌ డేవ్‌ పుల్లింగ్‌; జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ గ్లోబల్‌ వీపీ గోపాల్‌ పారిపల్లి; జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇంట్రూజన్‌ ప్రొడక్ట్స్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, తజ్మిన్‌ పిరానీ పాల్గొన్నారు.
 
‘‘హైదరాబాద్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడమన్నది భద్రతను నిర్మించడం కోసం సస్టెయినబల్‌ సాంకేతికతలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, భారతదేశంలో టెక్‌ ఇన్నోవేషన్‌, ప్రతిభావంతుల కేంద్రంగా నిలువాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అత్యంత కీలకమైనది’’ అని కె.టి. రామారావు అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘జాన్సన్‌ కంట్రోల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం, ఈ కేంద్రం ఏర్పాటులో మా వంతు పాత్ర పట్ల మేము గర్వంగా ఉన్నాము’’ అని అన్నారు.
 
ఈ కేంద్రం, 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ వద్దనున్న గౌర ఫౌంటెన్‌హెడ్‌ వద్ద ఉంది. ఇది భారతదేశంలో ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్ల (పూనె, గుర్‌గావ్‌, బెంగళూరు, ఢిల్లీ) నెట్‌వర్క్‌తో చేరుతుంది. దానితో పాటుగా భారతదేశంలో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఉనికిని సైతం విస్తరిస్తుంది. ఈ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం ప్రధానంగా సెక్యూరిటీ ఉత్పత్తుల పరిశోధన- అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌ ఉపకరణాలు వినియోగించి వినియోగదారుల అనుభవాలను సమూలంగా మార్చేందుకు ఇది అంకితమై ఉంది.
 
‘‘ఐఓటీ, ఏఐ మరియు 5జీ రూపంలో నూతన 5వ వేవ్‌ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పనితీరును ఉన్నతంగా మెరుగుపరుస్తూనే డీకార్బనైజేషన్‌, సస్టెయినబిలిటీ, ఇంధన సామర్ధ్యం, పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను అందించే రీతిలో భవంతులు పునరావిష్కరింప చేయబడుతున్నాయి’’ అని జాన్సన్‌ కంట్రోల్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, విజయ్‌ శంకరన్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ నూతన సెంటర్‌,  బిల్డింగ్‌  టెక్నాలజీలో మా నూతన ఆవిష్కరణలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాన్సన్‌ కంట్రోల్స్‌ యొక్క ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాల నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు.