మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2025 (18:18 IST)

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

Producer Vijay Pal Reddy Adidala, Udaya Bhanu, Vasishtha N Simha
Producer Vijay Pal Reddy Adidala, Udaya Bhanu, Vasishtha N Simha
త్రిబాణధారి బార్బరిక్ కథ కొత్త రకమైన కథ. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మలయాళంలో తీసినట్టుగా చాలా సహజంగా తీశాం. తెలుగు ఆడియెన్స్‌కు కావాల్సిన కమర్షియల్ అంశాల్ని కూడా జోడించాం. ముందుగా ఈ కథను చిన్న స్థాయిలో తీయాలని అనుకున్నా కూడా కథ డిమాండ్ మేరకు భారీగా నిర్మించాం.. అని నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల తెలిపారు.
 
డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ మూవీలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 29న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ మేరకు నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
 
ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
నేను నా వ్యాపారాలతో బిజీగా ఉండేవాడిని. ఓ సారి ఈ కథను విన్నాను. మోహన్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ముందుగా చిన్న బడ్జెట్‌తో మూవీని తీయాలని అనుకున్నాం. ఆ తరువాత మారుతి గారిని కలిశాను. తీస్తే సినిమా బాగా తీయండి.. లేదంటే లేదు అని ఆయన అన్నారు. దీంతో భారీ ఎత్తున ఈ మూవీని తీయాలని ఫిక్స్ అయ్యాను.
 
ప్రీమియర్లకు ఎలాంటి స్పందన వచ్చింది?*
ఈ కథను మైథలాజికల్ జానర్‌ను యాడ్ చేసి చెప్పడమే కొత్తగా ఉంటుంది. వరంగల్, విజయవాడలో ప్రీమియర్లు వేశాం. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాను చూసిన వారిలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మూవీ అద్భుతంగా ఉందని అందరూ పొగిడారు. మాకు అదే చాలా సంతృప్తినిచ్చింది.
 
టెక్నికల్ పరంగా ఎలా ఉంటుంది?
ఆడియెన్స్ ప్రస్తుతం కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లనే ఆదరిస్తున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి కొత్త. మాకు మారుతి అండగా నిలిచారు. కథతో పాటు టెక్నికల్ పరంగానూ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌ను తీసుకొచ్చాం. వారు ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి గారి విజువల్స్ వర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది.
 
మీ ప్రొడక్షన్‌లో  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణం ఏంటి?*
మా ప్రొడక్షన్‌‌లో కంటిన్యూగా చిత్రాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ‘త్రిబాణధారి బార్బరిక్‌’ పాటుగా ‘బ్యూటీ’ మూవీని ప్రారంభించాం. కంటెంట్‌ను నమ్మాను కాబట్టే ఈ రెండు చిత్రాలను ఎంతో నమ్మకంతో నిర్మించాను. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చోట కూడా బోర్ కొట్టదు. అది నా ఛాలెంజ్.
 
చిత్రంలో ఆర్టిస్టుల గురించి చెప్పండి?*
సత్య రాజ్ గారు మొదటి సిట్టింగ్‌లోనే మా కథను ఓకే చేశారు. ఇంత వరకు ఆయన పోషించనటువంటి పాత్రను ఆయన చేశారు. ఇందులోని ప్రతీ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదయభాను గారికి మంచి రోల్ వచ్చింది. ఈ మూవీ తరువాత ఆమెకు ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత అద్భుతమైన పాత్రలు వస్తాయి. సత్యం రాజేష్, వశిష్ట, సాంచీ రాయ్ ఇలా అందరి పాత్రలు ఆకట్టుకుంటాయి.
 
మూవీని చూసిన తరువాత మారుతి గారి స్పందన ఏంటి?*
మా మూవీని చూసిన తరువాత మారుతి గారు చాలా సంతృప్తి చెందారు. చిత్ర విజయం పట్ల ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. మారుమూల ప్రాంతాలకు సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వరంగల్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ప్రీమియర్లు వేశాం. ప్రస్తుతానికి ఈ మూవీని తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన భాషల్లో త్వరలోనే డబ్ చేస్తాం.
 
మూవీని ఎందుకు వాయిదా వేశారు?*
మైత్రి వాళ్లు నైజాంలో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వార్ 2, కూలీ ఆడుతున్నాయి కదా? భారీ సంఖ్యలో థియేటర్లు మనకు కావాలి కాబట్టి ఇప్పుడు వద్దులే అని ఆగస్ట్ 22 కాకుండ ఆగస్ట్ 29కి రిలీజ్ చేద్దామని వాళ్లు సలహాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు మాకు కావాల్సినన్ని థియేటర్లు లభించాయి. దీంతో భారీ ఎత్తున మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
 
ఇకపై డిఫరెంట్ కంటెంట్ చిత్రాలే వస్తాయా?
‘బార్బరిక్’ చిత్రం థ్రిల్లింగ్ ఇస్తుంది. బ్యూటీ మూవీ పూర్తిగా ఫ్యామిలీ, కమర్షియల్ చిత్రం. నెక్ట్స్ హారర్ కామెడీ కథ నచ్చడంతో ఓకే చేశాను. మరో రెండు ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. అవి ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.
 
త్రిబాణధారి బార్బరిక్ విషయంలో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చిన అంశం ఏంటి?
ఫ్యామిలీ అందరూ కలిసి మా సినిమాను చూడాలని అనుకుంటున్నాం. అందుకే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్లు ఇలా అన్నింట్లోనూ గరిష్టంగా రూ. 150 టికెట్ రేట్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నాం. మంచి సందేశంతో పాటుగా కమర్షియల్ అంశాల్ని జోడించి ఈ మూవీని తీశాం. త్రిబాణాస్త్రంలోని అసలు అర్థాన్ని చెప్పేలా, మంచి మెసెజ్ ఇచ్చేలా మా సినిమాను తెరకెక్కించాం. ఇప్పటి వరకు చాలా మందికి షో వేసి చూపించాం. వరంగల్‌లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోలో ఓ జంట ఫ్రీగా ఈ మూవీని చూశారు. కానీ ఇది ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదు అని వాళ్లు తిరిగి డబ్బులు ఇచ్చారు. అది చూసిన తరువాత నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది.