గురువారం, 28 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

anupama parameswaran
సినిమాల్లోనేకాకుండా వ్యక్తిగత విషయాల్లోనూ లోపాలను శోధిస్తున్నారంటూ హీరోయిన్ పనుపమ పరమేశ్వరన్ అంటున్నారు. ఆమె తాజాగా నటించిన చిత్ర "పరదా". లేడీ ఓరియంటెడ్ మూవీ. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ నగరంలో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, కమర్షియల్ చిత్రాల్లో ఎన్ని తప్పులు ఉన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని, కానీ, తమలాంటి వాళ్లు చేసిన ప్రయోగాత్మక, నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో మాత్రం తప్పులు వెతుకుతున్నారని నటి అనుపమ అన్నారు.
 
కొంతమంది వినోదాత్మక చిత్రాలకు ఇష్టపడితే, మరికొందరు కథాబలం ఉన్న సినిమాలను ఆదరిస్తారన్నారు. "పరదా" చిత్రాన్ని తాను ఎంతో ఇష్టపడి చేశారన్నారు. అయితే, కొందరు దీనిని ప్రయోగాత్మక చిత్రం అని చెబుతూనే అందులో లోపాలను వెతకడంపై దృష్టిపెడుతున్నారన్నారు. కమర్షియల్ చిత్రాల్లో వెయ్యి తప్పులున్నా ఎవరూ ప్రశ్నించరు. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికి వచ్చేసరికి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఇలాంటి ధోరణులో కనిపిస్తుంటాయి. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే సగం మంది విమర్శిస్తుంటారు. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తే ఇలాంటి కొత్త కథలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది అని ఆమె అన్నారు.