మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2025 (18:02 IST)

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

Santosh Shobhan, Manasa Varanasi
Santosh Shobhan, Manasa Varanasi
సంతోష్ శోభన్, మానస వారణాసి ప్రేమికులుగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది.  త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ రోజు సినిమా నుంచి 'నాలో నేను' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కొత్త స్టైల్ ట్యూన్ తో  కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా..సంజిత్ హెగ్డే పాడారు. 'నాలో నేను' పాట ఎలా ఉందో చూస్తే - నాలో నేను, తనలో తాను, కలిసే ఉన్నాం విడిగా, కాలమా కాలమా ఈవేళని తెల్లవారినీకమ్మా, దూరమా దూరమా రెప్పపాటులో మాయమై పోమ్మా, ఇందాక చేరుకుంది ఇందుకేనా, ఇంతేనా కాలమంతా మౌనమేనా..అంటూ మెలొడియస్ గా సాగుతుందీ పాట.