వైజాగ్‌లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో మ్యాచ్‌లో సఫారీలు చిత్తయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ళు అన్ని రంగాల్లో రాణించడంతో విజయభేరీ మోగించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సఫారీలు 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 48 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.
తప్పక గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 57, ఇషాన్ కిషన్ 54, హార్దిక్ పటేల్ 32 చొప్పున పరుగులు చేసి రాణించారు. ముఖ్యంగా ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్‌లో మంచి పునాది వేశారు. దీంతో భారత్ 179 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వా 180 పరుగుల గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు... 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో హెన్రిచ్ క్లాసెస్ 29, రిజా హెండ్రిక్స్ 23, ప్రిటోరియస్ 20 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా విఫలం కావడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3, అక్షర్ పటే, భవనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ గెలుపుతో భారత్ 1-2తో సిరీస్ రేసులో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది.