ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (10:09 IST)

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,923 పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. సోమవారంతో పోల్చుకుంటే ఈ కేసుల్లో తగ్గుదల 22.4 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్తగా నమోదైన తాజా కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396కు చేరింది. అలాగే, ఈ వైరస్ సోకడం వల్ల 17 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,890కి చేరుకుంది. కొత్తగా 7,293 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 79,313 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది.