శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (14:45 IST)

కాఫీ విత్ కరణ్‌.. విడాకులపై బాంబు పేల్చిన సమంత

Samantha
నార్త్‌లో ప్రముఖ పాపులర్ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్‌లో టాలీవుడ్ హీరోయిన్ సమంత పాల్గొంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి సమంత పాల్గొన్న ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 

 
ఈ ఎపిసోడ్‌లో చైతుతో విడాకుల గురించి బిగ్ బాంబ్ పేల్చడంతో పాటు చాలా సంచలన విషయాలు కూడా సమంత బయట పెట్టినట్టుగా తెలుస్తోంది.

 
సమంత కొన్ని సంచలన విషయాలు చెప్పిందన్న మ్యాటర్ బయటకు రావడంతో ఇప్పుడు అందరిలోనూ ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా ? అన్న ఉత్కంఠ అయితే ఉంది.

 
చైతు, అక్కినేని ఫ్యామిలీ గురించి పరోక్షంగా ఆమె ఘాటుగానే టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు. చైతూతో విడాకులకు గల కారణం ఏంటన్నది సమంత బహిరంగంగా మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. 

 
అయితే ఇప్పుడు తన విడాకులపై ప్రముఖ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో ఆమె బాంబు పేల్చినట్టు తెలుస్తోంది. మరి సమంత ఏ బాంబు పేల్చిందనే ఎపిసోడ్ బయటకు వస్తే కాని తెలియదు.