ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 మే 2022 (11:48 IST)

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా

Rashmika Mandanna
రష్మిక మందన్నా తక్కువ వ్యవధిలో బాలీవుడ్‌ ఇండస్ట్రీతో తన సంబంధాలను బలోపేతం చేసుకుంది. అనేక ప్రాజెక్ట్‌లకు సంతకం చేస్తోంది. బుధవారం రాత్రి కుచ్ కుచ్ హోతా హై దర్శకుడు కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకకు పుష్ప నటి రష్మిక హాజరయ్యారు. బ్లాక్ ఓపెన్ స్లిట్ నెట్ డ్రెస్‌లో పార్టీ లుక్‌లో మెరిసిపోయింది.

 
మరోవైపు ఇదే పార్టీకి వచ్చాడు లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కరణ్ జోహార్ వీళ్లిద్దరికి మాత్రమే ఇన్విటేషన్ పంపడం గమనార్హం. విజయ్ దేవరకొండ నల్లటి ప్యాంట్‌సూట్‌లో హుందాగా కనిపించాడు.