1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 మే 2022 (10:55 IST)

విజయ్ దేవరకొండ, సమంత సేఫ్‌గానే వున్నారు

Vijay Devarakonda,  Wennela Kishore, siva nirvana
Vijay Devarakonda, Wennela Kishore, siva nirvana
విజయ్ దేవరకొండ, సమంత తాజా సినిమా `ఖుషి.` ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జ‌రుగుతోంది. నిన్న‌నే షెడ్యూల్ కూడా పూర్త‌యింది. అయితే స‌మంత‌కు, విజ‌య్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. గాయాలు అయ్యాయి. అందుకే షెడ్యూల్ కేన్సిల్ అయింద‌నే వార్త‌లు కొంద‌రు రాస్తున్నారు. అవ‌న్నీ అబద్దం. అలాంటిది ఏమీ లేద‌ని చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారంనాడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. క‌శ్మీర్ నుంచి తిరిగి వ‌స్తున్న ఫోటీను పెట్టింది. చిత్ర ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ‌, వెన్నెల కిశోర్‌,  విజయ్ దేవరకొండలు హాయిగా న‌వ్వుకూంటా కారులో ప్ర‌యాణిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ, హీరోహీరోయిన్ల‌కు  గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది.దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు.