శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 మే 2022 (20:43 IST)

అవార్డు ఎంతో ఎన‌ర్జీ ఇచ్చింది - స‌మంత ప్ర‌భు

Critics' Choice Film Award
Critics' Choice Film Award
న‌టి స‌మంత ప్ర‌భుకు ఈ ఏడాది క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ ద‌క్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోను త‌న సోష‌ల్ మీడియా పెట్టి సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ముంబైలో జ‌రిగిన ఈ వేడుక‌లో ఆమె గ్రీన్ డ్రెస్‌తో కోడ్ డ్రెస్‌ను వేసుకుని యూత్‌ను గిలిగింత‌లు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను పెద్ద‌గా హిందీ మాట్లాడ‌క‌పోయినా ఫ్యామిలీ మ్యాన్ 2లో న‌టించిన రాజీ పాత్ర‌కు మంచి అప్లాజ్ వ‌చ్చింది. ఈ అవార్డు రావ‌డం చాలా గౌర‌వంగా భావిస్తున్నాను. ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రం చాలా ఎన‌ర్జీ ఇచ్చింది. ఆ ఎన‌ర్జీతో మ‌రిన్ని మంచి క‌థ‌లతో ముందుకు వ‌స్తాను అని చెప్పింది.
 
Samantha dress
Samantha dress
ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. ఒక‌సారి హిందీలో మాట్లాడ‌రా! అని అడిగితే, త‌న‌దైన శైలిలో న‌వ్వుతూ త్వ‌ర‌లోనే మాట్లాడ‌తాను. నేను ఇంకా చాలా మంచి క‌థ‌లున్న సినిమాల్లో న‌టించాల‌నుంద‌ని తెలిపింది. వెబ్‌సీరిస్‌లో మంచి మంచి క‌థ‌లు వ‌స్తున్నాయి. నైపుణ్యం గ‌ల టెక్నీషియ‌న్స్ ప‌నిచేస్తున్నార‌ని ఆమె పేర్కొంది. 
 
డ్రెస్‌గురించి మాట్లాడుతూ, నేను ఇలా వ‌చ్చానంటే అవార్డుకు ఇలానే రావాల‌ని అందుకే వ‌చ్చాన‌ని చెబుతూ, త‌న డ్రెస్‌ను స‌రిచేయ‌డానికి ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా కావాల్సివ‌చ్చింద‌ని చ‌మ‌త్క‌రించింది. ఆ ఇద్ద‌రూ ఆమె న‌డుస్తుంత‌సేపు కాళ్ళ‌కు అడ్డుప‌డ‌కుండా కారువ‌ర‌కు తీసుకెళ్ళ‌డం విశేషం.