శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (13:13 IST)

వైర‌ల్‌ అయిన అఖిల్‌కు స‌మంత శుభాకాంక్ష‌లు

Akhil- Samantha
Akhil- Samantha
అక్కినేని కుటుంబంనుంచి విడిపోయినా వారి స‌భ్యుల‌తో ఏదోవిధంగా పాలుపంచుకుంటోంది స‌మంత‌. సమంత, నాగచైతన్య టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అన్న నానుడికి తిర‌గ‌రాయ‌డం జ‌రిగింది. ఇటీవ‌లే త‌న ఇన్‌స్ట్రాలో పేరునుకూడా మార్చిన స‌మంత ఆ త‌ర్వాత ఫాలోవ‌ర్‌గా చైత‌న్య పేరుకూడా తీసేసింది. కానీ అఖిల్ పేరును అలా వుంచింది. ఈ శుక్ర‌వారం అఖిల్ పుట్టిన‌రోజు ఒక‌వైపు అఖిల్‌, నాగ చైత‌న్య ఇద్ద‌రూ ప‌బ్‌లో ఎంజాయ్ చేస్తూ వున్న ఫొటోను నాగ‌చైత‌న్య సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. త‌న భుజంపై ఎక్కించుకుని మ‌రీ ప‌బ్‌లో డాన్స్ వేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య  ఎప్పటికీ చాలా ప్రేమ వున్నంటే.. అంటూ పోస్ట్ చేశాడు.
 
మ‌రి స‌మంత కూడా అంత‌కంటే ధీటుగా పోస్ట్ చేసింది.  అఖిల్ నీకు హ్యప్పీ బర్త్‌డే, నువ్వు ఈ ఏడాది మంచి విజయాలు సాధించాలి. వరుస హిట్లతో దూసుకుపోయేలా.. దేవుడి ఆశీర్వాదం నీకు ఉండాలని కోరుకుంటున్నాన‌ని తెలిపింది. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిగా మారాయి. గ‌తంలో అఖిల్‌తో స‌మంత దిగిన ఫొటోలు కూడా త‌న సోష‌ల్‌మీడియాలో అలానే వుంచింది. అందులో ఓ ఫొటోనే ఇది. 
 
తాజాగా అఖిల్ 'ఏజెంట్స చిత్రంలో న‌టిస్తున్నాడు. చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రం రూపొందుతోంది. అఖిల్ పుట్టినరోజున మేకర్స్ కేవలం ‘సింపుల్’ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేయడంపై ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు.