శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (21:27 IST)

సమంత, అక్కినేని అఖిల్ మధ్య గొడవ ఏమిటి?

Samantha akhil chiatanya and others
Samantha akhil chiatanya and others
సమంతా రూత్ ప్రభు, అఖిల్ అక్కినేని మ‌ధ్య వార్ న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన స‌మంత అఖిల్ మ‌ధ్య వార్ అనేది కేవ‌లం సినిమాల మ‌ధ్య అనేది తెలుస్తోంది. వీరిద్ద‌రి సినిమాలు ఆగ‌స్టు 12న విడుద‌ల కావ‌డం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఫీమేల్ సెంట్రిక్ థ్రిల్లర్  సమంత 'యశోద' చిత్రం 12న  విడుద‌ల‌కాబోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇక అదేరోజు అఖిల్ అక్కినేని న‌టిస్తున్న టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన మీడియం రేంజ్ సినిమాల్లో 'ఏజెంట్' ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఇది స్పై యాక్షన్ అదేరోజు విడుద‌ల కావ‌డమే.
 
ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు యాదృశ్చికంగా వ‌చ్చాయా! లేక కావాల‌నే అక్కినేని కుటుంబం విడుద‌ల చేయిస్తుందా! అనేది సినిమావ‌ర్గాల్లో హాట్ టాపిక్\గా మారింది. ఎందుకంటే గ‌తంలో   సామ్ 'యు-టర్న్స విడుద‌ల రోజే నాగ చైతన్య  'శైలజా రెడ్డి అల్లుడు' సెప్టెంబర్ 13, 2018 న విడుద‌ల‌యి పోటీకి దిగాయి. అయితే అప్పుడు వాతావ‌ర‌ణం ప్ర‌కారం ఇద్ద‌రూ భార్య‌భ‌ర్త‌లు. కానీ ఇప్పుడు అలా కాదు. క‌నుక స‌మంత సినిమాను ధీటుగా విడుద‌ల‌చేయాల‌నే ఆలోచించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే గ‌తంలో గోవా బీచ్‌లో ఉండ‌గా స‌మంత‌, అఖిల‌పై చేయివేసి వున్న ఫొటో అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. స‌మంత కూడా త‌న ఇన్‌స్టాలో స్పెష‌ల్‌గా పెట్టింది.