గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (12:01 IST)

నా ఫేవరెట్ హీరో రామ్.. RRR ఎప్పుడు చూస్తానా అని?: సమంత

RRR సినిమాలో నటించినందుకు గాను రామ్ చరణ్‌పై ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించడం జరిగింది.

ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ కనిపించిన, నటించిన తీరుకు సమంత కూడా ఫిదా అయినట్టుంది. త్వరలోనే సినిమాను చూస్తానంటూ సమంత ఫుల్ ఎగ్జైటింగ్ అయ్యింది. ఈ మేరకు సమంత ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. 

"నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్‌కు స్పెషల్ హ్యాపీ బర్తడే.. ఆర్ఆర్ఆర్ సినిమా మీద వస్తున్న ప్రశంసలు, నీ మ్యాడ్ పర్ఫామెన్స్ మీద వస్తున్న టాక్ విని.. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఎగ్జైటింగ్ అవుతున్నాను" అని తెలుపుతోంది. 
Ramcharan
 
అయితే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ నువ్వు అర్హుడివే.. ఇకపై మరెన్నో విజయాలు అందుకుంటావు.. హ్యాపీ బర్తడే రామ్ చరణ్ అంటూ సమంత చెప్పుకొచ్చింది.

సమంత విషెస్‌తో రామ్ చరణ్ అభిమానులు అయితే తెగ సంబరపడిపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ కి స్పెషల్ విషెస్ తెలిపింది అంటూ ఓవైపు తెగ కామెంట్లు చేస్తున్నారు.