1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (10:03 IST)

అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని స్వీకరిస్తా : రాంచరణ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. "ఎస్ఎస్ రాజమౌళిగారి ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు" అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ రోజు తన జన్మదినం కాగా, ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తానని రాం చరణ్ వివరించారు.
 
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం మొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.223 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మరే భారతీయ చిత్రం ఈ ఘనతను ఇప్పటివరకు సాధించలేదు. 
 
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ వంటివారు ఈ చిత్రంలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా మూవీగా తెరకెక్కించారు.