మా ఇష్టం చిత్ర హక్కులు పొందిన రామసత్యనారాయణ
Apsara Rani, Naina Gangoli
ఇద్దరమ్మాయిల ప్రేమకథతో రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "మా ఇష్టం" హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో "డేంజర్" పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో "మా ఇష్టం" అని పేరు పెట్టారు.
గతంలో భీమవరం టాకీస్ బ్యానర్‌లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన "ఇద్దరమ్మాయిల ప్రేమకధ" కావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు.