బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (17:07 IST)

ఓటీటీలో బిగ్ బాస్: శ్రీ రాపాకకు ఆల్‌ ది బెస్ట్‌ అంటోన్న ఆర్జీవీ

ఓటీటీలో బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో కొందరు పాత కంటెస్టెంట్స్‌ కూడా ఉన్నారు. అలాగే.. ఈ 17 మందిలో ఓ హాట్‌ బ్యూటీ కూడా ఉంది. 
 
నగ్నం ఫేమ్‌ శ్రీ రాపాక.. బిగ్‌ బాస్‌ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఈ హాట్‌ బ్యూటీ శ్రీ రాపకకు టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అండగా నిలిచాడు. ఇప్పటికే అరియానా అషులకు సపోర్ట్ చేసిన వర్మ ప్రస్తుతం శ్రీ రాపకకు కూడా అండగా నిలిచాడు. 
 
అంతేగాకుండా తన హీరోయిన్‌ శ్రీ రాపాకకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ తన సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు వర్మ. దీంతో ఈ వీడియో వైరల్‌‌గా మారింది.