సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (17:06 IST)

మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఫోక‌స్

Vijay Shankar, Ashu Reddy,
విజ‌య్ శంక‌ర్, బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫోకస్‌’. ఈ చిత్రంతో సూర్య‌తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ వుతున్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోంది.
 
వాలెంటైన్స్ డే కానుక‌గా `ఫోక‌స్` మూవీ నుండి స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్ శంక‌ర్‌, అషు రెడ్డి ఒక‌రినొక‌రు హ‌త్తుకుని న‌వ్వుతూ కనిపిస్తున్నారు. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్ వాలెంటైన్స్ డేకి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అనేలా ఉంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ ను విడుద‌ల చేయనున్న‌ట్లు తెలిపింది చిత్ర యూనిట్‌.
 
విజయ్‌ శంకర్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో క‌నిపించ‌నున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ ఇతర ముఖ్య‌ పాత్రల్లో న‌టించారు.
 
నటీ నటులు: విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి. డైరెక్టర్‌: జి. సూర్యతేజ, సమర్ఫణ: స్కైరా క్రియేష‌న్స్‌, ఎడిటర్‌: సత్య. జీ, డీఓపీ: జే. ప్రభాకర్‌ రెడ్డి, సంగీతం: వినోద్‌ యజమాన్య, లిరిసిస్ట్: కాస‌ర్ల శ్యాం.