శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (14:37 IST)

వ‌ర్మ‌లా నేను అబ‌ద్దం చెప్పాను: రాజ‌మౌళి

Varma-Rajamouli
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌ను తాను రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో పోల్చుకున్నారు. మ‌గ‌ధీర స‌మంలో భారీ బ‌డ్జెట్ సినిమా తీయ‌డం చాలా క‌ష్ట‌మైంద‌నీ, ఇలాంటి ప్రాజెక్ట్‌లు ఇక చేయ‌న‌నీ, అందుకే నార్మ‌ల్ సినిమాలు తీస్తాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఈగ‌, సునీల్‌తో మ‌ర్యాద రామ‌న్న తీశారు. ఇదే ప్ర‌శ్న‌కు మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న్ను విలేక‌రులు అడిగారు. వెంట‌నే ఆయ‌న త‌డుముకోకుండా.. అప్పుడు అన్నానా.. అంటే నేను మ‌న‌సు మార్చుకున్నాను. రామ్‌గోపాల్ వ‌ర్మ‌లా నేను అబద్దాలు చెప్పాన‌నుకోండి అంటూ సెటైర్ వేశారు. వ‌ర్మ‌తో ఆయ‌న్ను పోల్చుకోవ‌డం అక్క‌డి విలేక‌రుల‌కు ఆశ్చ‌ర్యం వేసినా, రేపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. చూశాక ఏదో ఒక‌టి కామెంట్ చేస్తాడ‌ని ఇలా స‌మ‌ర్థించుకున్న‌ట్లు అనిపించింది.

 
అయితే ఆర్‌.ఆర్‌.ఆర్‌.  సినిమా ఈ నెల 25న విడుద‌ల‌ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, పాన్  వ‌ర‌ల్డ్ సినిమాల్లో బాహుబ‌లి త‌ర్వాత అంత‌కుమించి వుంటుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. సినిమా సినిమాకు స్థాయి పెరుగుతుంది. బాహుబ‌లిని జ‌పాన్‌లో కూడా చూశారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా అన్ని దేశాల్లోనూ తెలుగువారు చూస్తారు. తెలుగువారు చూస్తే అక్క‌డి ఇత‌ర బాషాల‌వారు కూడా చూస్తార‌ని చెప్పారు.