శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (15:36 IST)

వై.ఎస్‌. జ‌గ‌న్ కోసం విజ‌య‌వాడ‌కు వెళ్ళిన రాజ‌మౌళి!

Heroes with jagan
ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌. విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మార్చి 25న సినిమా విడుద‌ల తేదీ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ అన్నీ జ‌రిగిపోయాయి. ఒమిక్రాన్ కోవిడ్ త‌గ్గిన త‌ర్వాత రాజ‌మౌళి, చిత్ర నిర్మాత దాన‌య్య‌తోపాటు ప‌లువురు స్టార్ హీరోలు ఎ.పి. సి.ఎం. వై.ఎస్‌. జ‌గ‌న్‌ను క‌లిశారు. ఆ త‌ర్వాత సినిమా టికెట్ల రేట్ల‌పై సానుకూల ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.
 
తాజాగా రాజ‌మౌళి, దాన‌య్య ఇద్ద‌రూ సిఎం. జ‌గ‌న్‌ను క‌లిసేందుకు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ వ‌చ్చిన‌ట్లు ఆయా వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. వీరితో జ‌గ‌న్ భేటీ సారాంశం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌ధానంగా సినిమా ట‌కెట్ల పెంపుతోపాటు థియేట‌ర్ల లో ఎగ్జిబిట‌ర్ల స‌మ‌స్య‌లు కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కొద్దిగంట‌ల్లో వివ‌రాలు తెలియ‌నున్నాయి.