సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (15:41 IST)

సమంత గ్లామర్ ప్రదర్శన సరే... కియారా అద్వానీని చూసారా?

ఫోటో కర్టెసి-ట్విట్టర్
బాలీవుడ్ హీరోయిన్లు అంటేనే గ్లామర్‌కు కేరాఫ్ అడ్రెస్. ఈ గ్లామర్ కోసం వారు తినే తిండి దగ్గర్నుంచి నిద్ర, ఇతర అలవాట్లను సైతం లెక్కలు వేసుకుని మరీ చేస్తుంటారు. అందువల్లనే వారు పది కాలాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలుతుంటారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కోసం సమంత వేసుకున్న గ్రీన్ గౌన్ గురించి, అందులో ఆమె అందాల ప్రదర్శన గురించి విపరీతంగా ట్రోల్ జరిగింది. దీనితో ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు.
ఇదిలావుంటే తాజాగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్, మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంలో జోడీగా నటించిన కియారా అద్వానీ అవార్డు ఫంక్షన్ కోసం గ్లామర్‌కే అసూయ పుట్టేట్లు వస్త్రధారణ చేసుకుని వచ్చింది. ఇంకేముందు ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతూ సోషల్ మీడియాను ప్రస్తుతం షేక్ చేస్తున్నాయి.