చిక్ బళ్ళాపూర్‌లో ఆర్.ఆర్.ఆర్. ప్రీరిలీజ్ వేడుక
రాజమౌళి ఎటువంటి ప్రచారం చేసినా అది హాట్ టాపిక్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఆయన దృష్టి అంతా ఆర్.ఆర్.ఆర్. గురించే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈనెల 18న దుబాయ్‌లో బూర్జ్ ఖలీజా ప్రాంతంలో జరగనుంది. ఆ తర్వాత ఆంధ్రలో ప్రీరిలీజ్ వేడుక జరగోబోతుంది. అది కూడా ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతమైన చిక్ బళ్ళాపూర్‌లో జరగనుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఆంధ్ర, కర్నాటక బోర్డర్‌లో జరగబోయే ఈ వేడుకకు కర్నాటక రాజకీయనాయకులు, ఆంధ్ర నాయకులు కూడా హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తును ఎన్.టి.ఆర్. అభిమానులు చేస్తున్నారు. కర్నాటక రాష్ట్ర ఎన్.టి.ఆర్. ఫ్యాన్ అసోసియేషన్ కన్వీనర్ మాణిక్యం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ సభకు రెండు రాష్ట్రాల అభిమానులు రానున్నట్లు తెలుస్తోంది. చిక్ బళ్ళాపూర్‌లో జరగబోయే ఫంక్షన్ ఎప్పుడనేది త్వరలో తేదీని ప్రకటిస్తామని మాణిక్యం తెలియజేస్తున్నాడు. ఈ వేడుక జరిగాక ఫైనల్‌గా హైదరాబాద్‌లో మరోసారి ఆర్.ఆర్.ఆర్. వేడుక జరనున్నది. ఇప్పటికే ఈ సినిమాను ఈనెల 25న విడుదలచేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.