మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (16:36 IST)

ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ ఉంది : బ్రదర్ అనిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ వస్తుందని ఏపీ సీఎం జగన్ బావ, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ అన్నారు. ఆయన ఉత్తరాంధ్రలో సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
ఇందులో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. ఎన్నికలకు ముందు వైకాపా విజయం కోసం కృషి చేస్న సంఘాలు ఇపుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని బ్రదర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు గోడు వినేందుకే తాను ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. 
 
తనను పార్టీ పార్టీ పెట్టాలంటూ చాలా మంది కోరుతున్నారని కానీ పార్టీ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. దీనిపై సుధీర్ఘంగా ఆలోచన చేసి ఓ అభిప్రాయానికి వస్తానని చెప్పారు. పైగా, తన పరిశీలనలో ప్రధానంగా బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తుందని బ్రదర్ అనిల్ అన్నారు. దీన్ని ఖచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా, బ్రదర్ అనిల్ ఇటీవల కూడా విజయవాడలో ఇదే తరహాలో సమావేశమైన విషయం తెల్సిందే.