మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (13:55 IST)

జనసేన ఆవిర్భావ సభ - జనసేన ఏకైక ఎమ్మెల్యేకు నో ఎంట్రీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలోని ఇప్పంట గ్రామంలో జరుగుతుంది. ఇందులో పార్టీకి చెందిన అన్ని విభాగాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. 
 
కానీ, గత ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్‌పై విజయం సాధించిన రాపాక వరప్రసాద్‌కు మాత్రం ఈ ఆవిర్భావ సభకు ప్రవేశం లేదు. ఈ మేరకు బహిరంగ జరిగే ప్రాంతంలో ప్రత్యేకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ సభలోకి రాపాక వరప్రసాద్‌కు ప్రవేశం లేదని తెలియజేస్తూ ఇట్లు మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికులు" అని పోస్టర్లలో ముద్రించారు. 
 
కాగా, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రాపాక.. ఆ తర్వాత జనసేనకు దూరమై అధికార వైపాకాతో జట్టు కట్టిన విషయం తెల్సిందే. ఈ నేపత్యంలో ఆయనకు వ్యతిరేకంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.