మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (23:01 IST)

తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మీరా జాస్మిన్?

మీరా జాస్మిన్ మళ్లీ తెలుగు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఆమె బాలకృష్ణ, జగపతిబాబు, రవితేజ, పవన్ కల్యాణ్‌లతో సినిమాలు చేసింది. అయితే మీరా జాస్మిన్ పేరు వినగానే అందరికీ కూడా 'గుడుంబా శంకర్' సినిమానే గుర్తుకు వస్తుంది.
 
దక్షిణాది హీరోయిన్‌గా అదరగొట్టిన ఈమెకు గ్లామర్ పరంగా, నటనాపరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి గానీ, ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దాంతో సహజంగానే అవకాశాలు ముఖం చాటేశాయి. దీంతో పెళ్లి చేసుకుని సెటిలైంది. 
 
అలాంటి మీరా జాస్మిన్ రీసెంట్‌గా ఇన్ స్టా లో అడుగుపెట్టింది. ఇలా ఇ‌న్‌స్టాలో ఎకౌంట్ ఓపెన్ చేసిందో లేదో, అలా ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతోంది. మలయాళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులోను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.