మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (12:42 IST)

24న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుక్రవారం జారీచేయనుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రోజుకు 20 వేల చొప్పున మొత్తం 6.20 లక్షల టిక్కెట్లను విుడదల చేయనుంది. అలాగే 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు సర్వదర్శనం టోకెన్లను కూడా విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, జనవరి 5వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టిక్కెట్లను రోజుకు 5 వేల చొప్పున మొత్తం 55 వేల టిక్కెట్లను విడుదల చేస్తారు. అలాగే, ప్రతి రోజూ 5 వేల టిక్కెట్లను కూడా తిరుపతిలో జారీచేస్తారు. 31వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్‌‍లైన్ టిక్కెట్లను జారీచేస్తామని, అన్ని రకాల శ్రీవారి దర్శనం టిక్కెట్లను మాత్రం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తామని వెల్లడింతారు.