శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (12:30 IST)

వేసవిలో సందడి చేయనున్న "ఎఫ్-3"... మరోమారు రిలీజ్ వాయిదా

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న "ఎఫ్-3" చిత్రం విడుదల మరోమారు వాయిదాపడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన "ఎఫ్-2" చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. 
 
అయితే, ఇపుడు మరోమారు వాయిదావేశారు. వచ్చే యేడాది వేసవిలో సందడి చేయడానికి వస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. అంటే ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మంగళవారం తన ట్విటర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. 
 
"నవ్వుల పండగా ఇపుడు సమ్మర్‌లో ఏప్రిల్ 29వ తేదీన విడుదల, గెట్ రెడీ ఫర్ సమ్మర్ సోగాళ్లు" అంటూ ఎఫ్ -3 మూవీకి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.