శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (18:57 IST)

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు

Sri Kalasudha Telugu Association announcment
చెన్నైలో తెలుగువారి ఘన కీర్తిని చాటుతూ 1998 న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి సినీ రంగానికే కాక ఇతర రంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి సైతం అవార్డ్స్ ను బహుకరిస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది. ఇప్పుడు జరుపబోయే ఉగాది పురస్కారాల కార్యక్రమంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ కు అడుగులు వేస్తుంది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరుపని కారణంగా 2020, 2021లో విడుదలైన చలన చిత్రాలలోని 20 విభాగాలకు సంబంధించిన వారికే కాక ఇతర రంగాలలో రాణించిన విశిష్ట అతిధులకు అందించే  ఉగాది పురస్కారముల అవార్డ్స్ ప్రదానోత్సవం ను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో  ఏప్రిల్ 3 వ తేదీ 2022 ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్, సభ్యులు వెంకటేశ్వరరావు, దేవినేని సౌజన్యలు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ వడ్ల పట్ల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..చెన్నైలో  శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 1998  నవంబర్ 21న ఈ అసోసియేషన్ ప్రారంభించిన అసోసియేషన్ లో ఇప్పుడు 1200 పైచిలుకు సభ్యులు ఉన్నారు. వీరంతా తెలుగువారే.. అయితే బాపు గారు పరమపదించిన తర్వాత బాల సుబ్రహ్మణ్యం గారు బాపు పేరుతో  అవార్డు ఇవ్వాలని చెప్పడంతో గత 5 సంవత్సరాలుగా బాపు బొమ్మ, బాపు-రమణల పేర్లు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని అందరి సభ్యుల సహాయ సహకారాలతో ఈ అవార్డ్ ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా నిర్విస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 24వ సంవత్సరం లోకి అదుగుపెట్టిన సందర్భంగా "శ్రీ శుభకృతు" నామ సంవత్సర ఉగాది పండుగ రోజున మహిళా రత్న మరియు బాపు బొమ్మ, బాపు రమణ పురస్కారాలను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో  ఏప్రిల్ 3 వ తేదీ 2022 ఆదివారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు వేద ఆశీర్వచన పఠనంతో ప్రారంభించి 2020, 2021లో విడుదలైన చలన చిత్రాలతో 20 విభాగాలకు సంబంధించిన నటీనటులను,  దర్శక నిర్మాతలను  మరియు సాంకేతిక నిపుణులను ఉగాది పురస్కారములతో మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణులకు  మహిళా రత్న పురస్కారం వెండి కిరీటం ధారణతో సత్కరించుటకు  కమిటీ సభ్యులతో చర్చించి  నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్  శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ,  ఐఏఎస్ ఆఫీసర్ డా. రామ మోహన్ రావు, శ్రీ ఆర్ శేఖర్ రెడ్డి,శ్రీ పి.యస్. ప్రకాష్ రావు మరియు సినీ రంగ ప్రముఖులు,నటీనటులతో పాటు పాటు శ్రీ కళాసుధ సభ్యులు ఈ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది.అని అన్నారు. 
 
ముఖ్య ఆతిదిగా వచ్చిన మోహన్ వడ్లపట్ల  మాట్లాడుతూ.. శ్రీనివాస్ గారు 24 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ను చెన్నై లో ఏర్పాటు చేశారు.అక్కడ తెలుగు అనేదానికి బాగా ఎస్టాబ్లిస్ చేశాడు.సినీ రంగానికే కాకుండా ఇతర రంగాలకు కూడా అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నా సినిమా "కలవరమాయే మదిలో" సినిమాకు ఇక్కడ బెస్ట్ నంది అవార్డు వచ్చింది. అయితే ఈ అసోసియేషన్ వారు ఫోన్ చేసి నా సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డ్ ఇస్తామని సర్ప్రైజ్ చేయగా..   ఆ అవార్డ్ ను జయప్రద చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.దిన డినాభివృద్ధి చెందుతూ నేటితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే  ఈ సంవత్సరం అవార్డ్స్ కు చీఫ్ గెస్ట్ గా..టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వస్తుండగా, విశిష్ట అతిధులుగా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ రామ్మోహన్  వస్తున్నారు