గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (12:39 IST)

నేడే టీ20 జాతర షురూ: CSK VS Kolkata

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గత రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య నేడు జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది.  ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గెలుపుతో ఈ సీజన్‌లో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి. 
 
2021 సీజన్లో అట్టడుగున నిలిచి, గత ఏడాది అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. అద్భుత ఆటతో కప్పు ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్ కింగ్స్. 
 
గతేడాది ప్రథమార్ధంలో పేలవ ప్రదర్శన చేసి, ద్వితీయార్ధంలో గొప్పగా పుంజుకుని ఫైనల్‌ చేరి త్రుటిలో కప్పు చేజార్చుకుంది కోల్‌కతా. ఈసారి సమవుజ్జీల్లా కనిపిస్తున్న ఈ జట్లలో శుభారంభం చేసేది ఏదో చూడాలి.
 
ఇక లీగ్‌ ఆరంభం నుంచి ఆ జట్టును నడిపిస్తున్న ధోనీ.. తొలిసారి కేవలం సభ్యుడిగా బరిలోకి దిగుతున్నాడు. మహీ నుంచి ఈ సీజన్‌కు జడేజా పగ్గాలందుకున్న సంగతి తెలిసిందే.