ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (19:24 IST)

సాయి ధరమ్ తేజ్ తెచ్చిన‌ గుడ్ న్యూస్ ఏమిటి!

Sai Dharam Tej
ఇటీవ‌లే బైక్ ప్ర‌మాదానికి గుర‌యి కోమాలో కొంత‌కాలం వుండి కోలుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ అంటూ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఈ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, ఇంకా కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని వెల్లడించారు. వీడియో కాస్త నీర‌సంగా వున్నా కోలుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు.
 
అంత‌కుముందే కొన్ని ఫొటోలు పెట్టి అభిమానుల‌కు తెలియ‌జేశాడు. కానీ ఏవో అనుమాన‌లు కొంద‌రికి వ‌చ్చాయి. అందుకే వీడియో ద్వారా ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చాడు.  సెప్టెంబర్ నెల‌లో ప్ర‌మాదానికి గురైన సాయి ధరమ్  దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విష‌యం తెలిసిందే.