ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (17:22 IST)

నా ఫేవరేట్ హీరో చెర్రీకి హ్యాపీ బర్త్‌డే విషెస్ : సమంత

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు అనేక మంది సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాంటివారిలో హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. తాజాగా చరణ్ పుట్టినరోజుపై సమంత తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. "నా ఫేవర్ రామ్ చరణ్‌కు వెరీ స్పెషల్ బర్త్‌డే" అంటూ విషెస్ తెలిపారు. 
 
మరోవైపు, గత శుక్రవారం విడుదలైన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో రామ్ చరణ్ మతిపోయేలా నటించాన వైనం గురించి వినడం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. పైగా, "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని ఎపుడెపుడు చూద్దామా అని తహతహలాడుతున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. కాగా, చెర్రీ, సమంతల కాంబోలో గతంలో "రంగస్థలం" చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.