ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి  
                                       
                  
                  				  అనంతలో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఎస్ వీ మ్యాక్స్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.
				  											
																													
									  
	 
	ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు సందీప్ ధ్రువీకరించారు.
				  
	 
	తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ కుప్పకూలి పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు