గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (15:26 IST)

మేలో పుష్ప ది రైజ్ షూటింగ్ ?

Allu arjun, Sukumar, Devisree Prasad
పుష్ప సీక్వెల్ పుష్ప ది రైజ్ షూటింగ్ ఇంత‌కుముందు చెప్పిన‌ట్లు ఏప్రిల్ జ‌ర‌గ‌డంలేద‌నీ మేలో కానీ జూన్‌లో జ‌ర‌గ‌నున్న‌ద‌ని ఓ టాక్ ఫిలింన‌గర్‌లో వినిపిస్తోంది. అన్నీ అనుకూలంగా వుంటే ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నుంది. కానీ సాంకేతిక స‌మ‌స్య‌తో ఈ చిత్రం షూటింగ్ మేకానీ, జూన్ కానీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టికి అట‌వీ ప్రాంతంలో షూటింగ్ చేయాలంటే కొంత‌మేర‌కు వ‌ర్షంకూడా తోడుకావాల‌ట‌. అందుకోసం ఆ స‌మ‌యం బెట‌ర్ అని భావించిన‌ట్లు స‌మాచారం. 
 
ఇక ఈ సినిమా మొద‌టి భాగంలో స‌మంత చేసిన ఐటెం సాంగ్ యూత్‌లోఒక ఊపు ఊపింది. సీక్వెల్‌లోకూడా సంద‌ర్భానుసారంగా మ‌రో పాట వుండాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు దిశా పటానిను కానీ, త‌మ‌న్నాను కానీ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే గ‌ని సినిమాలో ఆమె న‌టించింది. ఇక ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌చేయాల‌నే ముందుగా ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఈ సినిమాను 2023 సంక్రాంతి బ‌రిలో వుండ‌బోతోంద‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లో దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.