సంబంధిత వార్తలు
- నేను తెలుగుదేశంలో చేరుతున్నా... ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి ఆడపడుచు షాక్
- స్టీవెన్ స్పీల్బర్గ్ కెమెరా ఎక్విప్మెంట్తో తీసిన జగడం చిత్రానికి 15 ఏళ్ళు
- సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. కొత్త సినిమా
- చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్ రాబోతోంది!
- పుష్ప భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ఐకానిక్ మూవీ
నా కళ్లు చెమర్చాయి - సుకుమార్
Sukumar rupam
తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయం భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో.. ఆ పంటను సుకుమార్ రూపానికి తీసుకువచ్చాడు. ఇలా అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్ అందరి దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. సుకుమార్ రూపంతో పాటు.. పుష్ప 2 అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసిన సుకుమార్ నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?.. అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.
