గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (17:17 IST)

పుష్ప భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ఐకానిక్ మూవీ

Pushpa, Sukumar
అల్లు అర్జున్ న‌టించిన పుష్ప దేశంలో ఇంటి పేరుగా మారింది. ఈ మధ్య కాలంలో మరే ఇతర సినిమా చేయని ప్రభావాన్ని సృష్టించింది. అన్ని వయసుల వారు పుష్ప మేన‌రిజంకు అనుగుణంగా మారారు. త‌గ్గెదేలే, మెయిన్ ఝుకేగానహి అంటూ హిందీలో వేడుకలకు పర్యాయపదంగా మారారు. ఇవి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం కాకుండా త్వరలోనే క్రికెట్ ఫీల్డ్‌కి కూడా ప్రవేశించాయి, ఇది ప్రపంచవ్యాప్త టచ్‌ని ఇస్తుంది. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ వంటి అనేక మంది పుష్ప ట్రెండ్‌లో భాగమయ్యారు.
 
ఇటీవల జరిగిన ఇండియా vs శ్రీలంక మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన తర్వాత, రవీంద్ర జడేజా త‌గ్గేదేలేని వేడుకకు గుర్తుగా ఉపయోగించాడు. విరాట్ కోహ్లీ కూడా అదే సంజ్ఞతో వేడుకలో భాగమయ్యాడు. ఐఎస్ఎల్ సందర్భంగా ఫుట్‌బాల్ మైదానంలో ఉన్న ఆటగాళ్లు శ్రీవల్లి హుక్‌స్టెప్‌కు వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప దేశవ్యాప్తంగా సానుకూల ఆనందాన్ని సృష్టించారు మరియు ప్రజలు ఈ వేడుకలో భాగం కావడానికి వారి స్వంత మార్గాన్ని కనుగొంటున్నారు.
 
ఈ సినిమా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడమే కాకుండా వారి హృదయాల్లోకి ఎక్కింది. బాలీవుడ్ సెలబ్రిటీలు తాము సినిమాను ఎంతగా ఆస్వాదించామనే దాని గురించి పదేపదే మాట్లాడుతున్నారు. వారి ప్రేమను చూపించడానికి స్టెప్పులను అనుకరించారు. తాజాగా ఈ జాబితాలో చేరిన రణవీర్ సింగ్ త‌గ్గేదేలా అంటూ మేన‌రిజం చూపిస్తున్నాడు.