శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (17:18 IST)

"డీజే టిల్లు" బ్యూటీకి లక్కీ ఛాన్స్.. బన్నీతో స్క్రీన్ షేరింగ్

"డీజే టిల్లు"తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హీరోయిన్ నేహా శెట్టి. ఈమె ఇపుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ బ్యూటీకి ఇపుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించే అరుదైన ఛాన్స్‌ను దక్కించుకున్నారు. అయితే, ఈ ఛాన్స్ వెండితెరపై కాదు సుమా... ఓ ప్రచార యాడ్‌ కోసం వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. 
 
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాజప్ జొమాటోకు అల్లు అర్జున్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దీనికోసం తాజాగా కొత్త యాడ్‌ను రూపొందించారు. ఈ యాడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. కాగా, అల్లు అర్జున్ పుష్ప చిత్రం కోసం సిద్ధమవుతున్న విషయం తెల్సిందే.