బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (11:01 IST)

"టిల్లుగాడి లొల్లి ఆహాలో" అతి త్వరలో.. ఓటీటీలో "డీజీ టిల్లు"

ఇటీవల విడుదలైన చిత్రం "డీజే టిల్లు". సినిమా థియేటర్లలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మంచి కిక్కునిచ్చింది. ఇపుడు ఈ కిక్కు ఓటీటీ ప్రేక్షకులకు అందిచేందుకు సిద్ధమైంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేకక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పడించింది. మంచి పాజిటివ్ టాక్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన ఆహాలో ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "ఇక టిల్లుగాడి లొలి ఆహాలో" అతి త్వరలో అంటూ పేర్కొంది. అయితే, ఈ మూవీని ఓటీటీలో ఎపుడు రిలీజ్ చేస్తారో స్పష్టమైన తేదీని వెల్లడించలేదు. కానీ, మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావచొచ్చన్న ప్రచారం సాగుతోంది.